వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించడం అన్యాయం

ఖండించిన ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు కరీంనగర్‌-జనత న్యూస్‌ తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును రాష్ట్ర ప్రభుత్వం తొలగించడాన్ని తీవ్రంగా ఖండిరచారు ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు. ఈ మేరకు ఆ సంఘ ప్రతినిధి కైలాస్‌ నవీన్‌ ప్రకటన విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాలలో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయాలకు పొట్టి శ్రీరాములు పేరును తొలగిస్తూ ఈ నెల 20న రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. భాషా ప్రయక్త రాష్ట్రము కోసం 58 రోజుల పాటు … Read more

బీఆర్‌ఎస్‌కు షాక్‌..

నల్గొండ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసు కూల్చివేతకు ఆదేశాలు హైకోర్టు తీర్పుతో గులాబీ నేతల నారాజ్‌ హైకోర్టు : హైకోర్టులో బీఆర్‌ఎస్‌ పార్టీకి చుక్కెదురైంది. నల్గొండ జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని కూల్చి వేయాలని మున్సిపల్‌ శాఖకు ఆదేశాలిచ్చింది న్యాయస్థానం. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్‌ చేసే విధంగా మున్సిపల్‌ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్‌ వేశారు బీఆర్‌ఎస్‌ నేత. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పార్టీ కార్యాలయం కట్టిన తర్వాత ఏ రకంగా అనుమతిస్తారని ప్రశ్నించింది. … Read more

వచ్చే ఎన్నికల్లో ‘రాహుల్‌-క్విట్‌ ఇండియా’ నినాదం

కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్‌ విదేశీ గడ్డపై భారత్‌ పరవు తీశారని ఆగ్రహం హైదరాబాద్‌ : వచ్చే ఎన్నికల్లో ‘రాహుల్‌`క్విట్‌ ఇండియా’ నినాదంతో ముందు కెళ్తామని సంఛలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌. హైదరాబాద్‌ గచ్చిబౌలి ఎస్సార్‌ కన్వెన్షన్‌ హాలులో రంగారెడ్డి అర్బన్‌ జిల్లా ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, రంగారెడ్డి అర్బన్‌ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, కూన … Read more

బతుకమ్మ చీరలకు బదులుగా..

మరో పథకం.. మహిళా సంఘ సభ్యులకు చీరలు                                                                                        804.64 కోట్ల వస్త్రోత్పత్తికి సీఎం ఆదేశాలు ఇక … Read more

చేనేత రుణమాఫీకి గ్రీన్‌ సిగ్నల్‌

రూ. 30 కోట్లకు పైగా నేతన్నలకు లబ్ధి సహకార సంఘాల క్యాష్‌ క్రెడిట్‌.. ముద్ర లోన్స్‌ మాఫీ అయ్యే అవకాశాలు ముందే చెప్పిన ‘జనత ’ దిన పత్రిక జనత న్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి తెలంగాణలో చేనేత రుణమాఫీకి పచ్చ జెండా ఊపింది కాంగ్రెస్‌ సర్కారు. హైదరాబాద్‌లో ఐఐహెచ్‌టీ ప్రారంభ సభలో సంబంధిత అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత … Read more

తెలంగాణలో రెండు రోజులు వర్షాలు

జనత న్యూస్‌ : తెలంగాణలో సోమ, మంగళ వారాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం కొమరంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు..ఆదిలాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, భద్రాద్రి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో కొద్దిపాటి వర్షాలు పడుతాయని పేర్కొంది. మంగళవారం ఆదిలాబాద్‌ జిల్లాలో … Read more

ప్రయివేటు ఉపాధ్యాయులకు సంక్షేమ చట్టం చేయాలి

ట్రస్మా మాజీ రాష్ట్ర అధ్యక్షులు శేఖర్‌రావు కరీంనగర్‌-జనత న్యూస్‌ బడ్జెట్ ఉపాధ్యాయుల సంక్షేమ చట్టం బిల్లుని వేంటనే పార్లమెంట్‌ లో, అసెంబ్లీ లో ప్రవేశ పెట్టాలని ట్రస్మా మాజీ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్‌ రావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయులకు రూ.10 లక్షల ఆరోగ్య భీమా, అదేవిధంగా మరో రూ.10 లక్షల జీవిత భీమా సౌకర్యాలను కల్పించాలని సూచించారు. ప్రతి సంవత్సరం 10వ తరగతిలో 10/10 … Read more

దళిత ఎమ్మెల్యేలను అవమానపరుస్తున్న పోలీస్‌ బాస్‌లు

భువనగిరి ఘటన పై స్పీకర్‌ కు, కరీంనగర్‌ సీపీపై సీఎం కు ఫిర్యాదు చేస్తాం ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్‌-జనత న్యూస్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లా భువనగిరిలో దళిత ఎమ్మెల్యే వేముల వీరేశం (నకిరేకల్‌)కు పోలీసుల వల్ల జరిగిన ఘోర అవమానంపై స్పీకర్‌ కు ఫిర్యాదు చేయనున్నట్టు మానకొండూర్‌ శాసనసభ్యుడు డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆహ్వానం మేరకు భువనగిరికి వచ్చే రాష్ట్ర మంత్రులు ఉత్తం కుమార్‌ … Read more

వరద బాధితులకు జూ.ఎన్టీఆర్‌ సాయం

తెలంగాణ ఉద్యోగులు సైతం రూ.100 కోట్ల విరాళం జనత : తెలంగాణలో భారీ వర్షాలు సృష్టించి బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రధానంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో భారీ నష్టం వాటల్లింది. వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గూడు చెదిరి, సర్వస్వం కోల్పోయి, కట్టు బట్టలతో రోడ్డున పడ్డ వేలాది కుటుంబాలను చూస్తే ఎవరైనా ఛలించక ఉండలేరు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు, పంటలు నీట మునిగిన వేలాది కుటుంబాలకు ఎంత సాయం చేసినా తక్కువే. రాష్ట్ర … Read more

‘సుప్రిం’కు సీఎం సారీ

జనత : ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భారత అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌ అయిన విషయం తెలిసిందే. మీడియాల్లో ఈ వార్త హైలైట్స్‌ కాగా..దీనిపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. సుప్రిం కోర్టుకు క్షమాపన చెప్పారు. ఎక్స్‌ ఖాతాలో ఆయన పోస్టు చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం..తన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థను ప్రశ్నించినట్లు ఆపాదించారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత … Read more