అర్హులైన జర్నలిస్టులకే  నివేషణ స్థలాలు దక్కాలి 

కరీంనగర్ జర్నలిస్టుల నివేషణ స్థలాల్లో జరిగిన అక్రమాలపై గొంతు విప్పింది మేమే  ఆ సంఘం నేతలది ధృతరాష్ట్ర కౌగిలి డబ్ల్యూజేఐ రాష్ట్ర నాయకుడు తాడూరు కరుణాకర్ కరీంనగర్, అక్టోబర్ 6 :- అర్హులైన జర్నలిస్టులందరికీ నివేషణ స్థలాలు రావాలన్నది తమ లక్ష్యమని, అందుకోసం ఎలాంటి పోరాటాల కైనా సిద్ధమని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర నాయకుడు తాడూరు కరుణాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ రోడ్డులోని డబ్ల్యూజేఐ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా … Read more

టీచర్స్‌ ఎమ్మెల్సీకి భారీగా ఆశావాహులు !

బీజేపీలో పెరిగిన ఆశావాహులు కేంద్ర మంత్రుల వద్దకు క్యూ.. కాంగ్రెస్‌ నుండి హర్షవర్థన్‌ రెడ్డి ప్రయత్నాలు పీఆర్‌టీయూ మాండేట్‌ కోసం పలువురు జనత న్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. బీజేపీ మద్దతు కోసం ఇప్పటి నుండే పలువురు ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ లను కలుస్తూ తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. మండలిలో … Read more

అల్ఫోర్స్‌ నరేందర్‌ రెడ్డికి రాష్ట్ర రెడ్డి జేఏసీ మద్దతు

కరీంనగర్‌-జనత న్యూస్‌ అల్ఫోర్స్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ నరేందర్‌ రెడ్డి రాష్ట్ర రెడ్డి జేఏసీ మద్దతు ప్రకటించింది. కరీంనగర్‌లో జేఏసీ ప్రతినిధులు ఏ రాంరెడ్డి, పి.రాంరెడ్డి, శ్రీధర్‌ రెడ్డి, చుక్కారెడ్డి తదితరులు వారిని కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నేడు తెలంగాణలోని విద్యారంగం దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిందని, విద్యార్థులకు తక్కువ ఫీజులో నాణ్యతమైన విద్యనందిస్తూ అగ్రగామిగా కొనసాగుతుండడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఒక గొప్ప విద్యావేత్త, సౌమ్యశీలుడైన నరేందర్‌ రెడ్డిని రాబోయే … Read more

అల్ఫోర్స్‌ నరేందర్‌ రెడ్డి దూకుడు

గ్రౌండ్ లో వాకర్స్ ను కలుస్తూ..ఆధ్యాత్మిక వేడుకల్లో పాల్గొంటూ.. కరీంనగర్‌-జనత న్యూస్‌ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్దమైన అల్ఫోర్స్ అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి..ప్రచారంలో దూకుడుగా వెళ్తున్నారు. నగరంలోని ఆయా గ్రౌండ్స్ లో వాకర్స్ ను కలుస్తూ ముందుకు సాగుతున్నారు. కరీంనగర్‌ లోని డాక్టర్‌ అంబేద్కర్‌ స్టేడియంలో వాకర్స్‌ను ఆయన కలసి మద్దతు కోరారు. కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని, ఈ సారి తనకు అవకాశం కల్పించాలని యువకులను కోరారు. తెలంగాణ రాష్ట్ర … Read more

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి..

అల్ఫోర్స్‌ అధినేత నరేందర్‌ రెడ్డి శంఖారావం కరీంనగర్‌-జనత న్యూస్‌ కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఆరు నెలల ముందుగానే ప్రచార శంఖారావాన్ని పూరించారు అల్ఫోర్స్‌ విద్యా సంస్థల అధినేత డాక్టర్‌ నరేందర్‌ రెడ్డి. కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లిలో క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. వేద మంత్రాల మధ్య అర్చకుల ఆశీర్వచనాలు అందుకుని, విద్యాసంస్థల యాజమాన్యాలు, అభిమానులు, శ్రేయోభిలాషుల నడుమ తల్లిదండ్రులచే రిబ్బన్‌ కటింగ్‌ చేయించారు నరేందర్‌ రెడ్డి. పట్టభద్రుల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అధిక మెజారిటీతో … Read more

కరీంనగర్‌ ఎమ్మెల్సీపై గురి

ఆరు నెలల ముందు నుండే ఫోకస్‌ ఎమ్మెల్యేల సమిష్టి కృషిపై కాంగ్రెస్‌ భవిష్యత్‌ ప్రభుత్వ వైఫల్యాలే బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రచారణాస్త్రాలు జనత న్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి ప్రధాన పార్టీలు. ఎన్నికకు మరో ఆరు నెలల ముందుగానే వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు ఆయా పార్టీల నేతలు. ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడ లను అధికార కాంగ్రెస్‌ నిశితంగా పరిశీలిస్తుండగా..మరోవైపు టికెట్‌ కోసం ఆయా పార్టీల ఆశావాహులు ఇప్పటి నుండి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. … Read more

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న అఘోర

మల్యాల-జనత న్యూస్‌ జగిత్యాల జిల్లా మల్యాల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజనేయ స్వామిని దర్శించుకుంది మహిళా అఘోర. కొత్త కారులో నుండి దిగిన అఘోర..ఆలయం లోనికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుంది. లోక కళ్యాణం కోసమే ఆలయాల సందర్శన చేస్తున్నట్లు వెల్లడిరచిన ఆమె.. త్వరలోనే కొండగట్టు శివారులో ఆశ్రమం ఏర్పాటు చేసి ప్రకృతి సేవ చేస్తానని చెప్పారు. మానవ సేవ కంటే ప్రకృతి సేవ చాలా గొప్పదని ఈ సందర్భంగా తెలిపారు. అంతుకు ముందు వచ్చే … Read more

2025 నాటికి జోయెటిస్‌ ద్వారా ఉద్యోగాలు

సామర్థ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌ : 2025 చివరి నాటికి వందలాది సాఫ్ట్‌వేర్‌, పశు వైద్య నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. హైదరాబాద్‌ రాయదుర్గంలో మంగళవారం ఆయన జోయెటిస్‌ గ్లోబల్‌ సామర్థ్య కేంద్రాన్ని(జిసిసి) ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. పశు వైద్య రంగంలో ప్రపంచ దిగ్గజం జోయెటిస్‌ ప్రవేశంతో లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో హైదరాబాద్‌ కొత్త మైలు రాయిని దాటిందని పేర్కొన్నారు. పశువులు, … Read more

కొట్లాడండి…గళం విప్పండి..

తలుచుకుంటే సర్కార్‌ తలరాతలే మారతాయి కాంగ్రెస్‌ కు ఓట్లేస్తే టీచర్లకు ఏం ఒరిగింది? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ గురుపూజోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు కరీంనగర్‌-జనత న్యూస్‌ రోడ్లపైకొచ్చి కొట్లాడండి..విద్యార్థుల సమస్యలపై గళం విప్పండని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌. కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఆడిటోరియంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయ సమస్యలపై తాను పోరాడి జైలుకెళ్లానని, ఎన్నికల్లో మాత్రం … Read more

తెలంగాణలో రెండు రోజులు వర్షాలు

జనత న్యూస్‌ : తెలంగాణలో సోమ, మంగళ వారాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం కొమరంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు..ఆదిలాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, భద్రాద్రి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో కొద్దిపాటి వర్షాలు పడుతాయని పేర్కొంది. మంగళవారం ఆదిలాబాద్‌ జిల్లాలో … Read more