Monday, October 26, 2026

దళిత ఎమ్మెల్యేలను అవమానపరుస్తున్న పోలీస్‌ బాస్‌లు

భువనగిరి ఘటన పై స్పీకర్‌ కు,
కరీంనగర్‌ సీపీపై సీఎం కు ఫిర్యాదు చేస్తాం
ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ
కరీంనగర్‌-జనత న్యూస్‌
ఉమ్మడి నల్లగొండ జిల్లా భువనగిరిలో దళిత ఎమ్మెల్యే వేముల వీరేశం (నకిరేకల్‌)కు పోలీసుల వల్ల జరిగిన ఘోర అవమానంపై స్పీకర్‌ కు ఫిర్యాదు చేయనున్నట్టు మానకొండూర్‌ శాసనసభ్యుడు డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆహ్వానం మేరకు భువనగిరికి వచ్చే రాష్ట్ర మంత్రులు ఉత్తం కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ప్రభృతులకు ఆహ్వానం పలికేందుకు హెలికాప్టర్‌ వద్దకి వెళుతున్న ఎమ్మెల్యే వేముల వీరేశం ను అడ్డుకోవడమే కాకుండా ఛాతిపై చేయి వేసి తోసివేసి ఘోరంగా అవమానించారని ఆయన ఆరోపించారు.
ఇది ప్రభుత్వపరంగా జరిగిన తప్పిదం ఎంతమాత్రం కాదని, ఎస్సీలపట్ల పోలీస్‌ అధికారులకు ఉన్న చిన్నచూపు, చులకనభానం,దురహంకారమే కారణమని ఆయన పేర్కొన్నారు. దురహంకార పోకడలు గల పోలీసు అధికారులు అక్కడక్కడ ఉన్నారని, కరీంనగర్‌ పోలీస్‌ బాస్‌ కూడా ఇదే తరహా పోకడలను అనుసరిస్తున్నారని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆరోపించారు. మానకొండూర్‌ సీఐ పోస్టు ఖాళీగా ఉండటంతో అక్కడ సీఐని ముఖ్య మంత్రి సహకారం తో నియమిస్తే దాన్ని కరీంనగర్‌ సీపీ రద్దు పర్చారని, త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించకుండా సీఐకు పోస్టింగ్‌ ఇవ్వడం కుదరదని మెలిక పెట్టగా, సీపీ సూచన మేరకు బోర్డ్‌ మీటింగ్‌ నిర్వహించి సీఐ పోస్టింగ్‌ ఇచ్చారని ఆయన తెలిపారు. అయితే నేను కాదన్నా ఎలా పోస్టింగ్‌ తెచ్చుకున్నావంటూ సదరు సీఐని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ధళిత ఎమ్మెల్యే ఇంకో దళిత అధికారికి సీఐ పోస్టింగ్‌ వేయిస్తారా? అనే చిన్నచూపు, దురహంకారంతోమే సీపీ అభ్యంతరానికి కారణమని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్‌ సీపీ నిర్వాకాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దృష్టి తేనున్నటు ఎమ్మెల్యే డాక్టర్‌ సత్యనారాయణ తెలిపారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page