అర్హులైన జర్నలిస్టులకే  నివేషణ స్థలాలు దక్కాలి 

కరీంనగర్ జర్నలిస్టుల నివేషణ స్థలాల్లో జరిగిన అక్రమాలపై గొంతు విప్పింది మేమే  ఆ సంఘం నేతలది ధృతరాష్ట్ర కౌగిలి డబ్ల్యూజేఐ రాష్ట్ర నాయకుడు తాడూరు కరుణాకర్ కరీంనగర్, అక్టోబర్ 6 :- అర్హులైన జర్నలిస్టులందరికీ నివేషణ స్థలాలు రావాలన్నది తమ లక్ష్యమని, అందుకోసం ఎలాంటి పోరాటాల కైనా సిద్ధమని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర నాయకుడు తాడూరు కరుణాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ రోడ్డులోని డబ్ల్యూజేఐ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా … Read more

కేటీఆర్‌ వర్సెస్‌ కొండా సురేఖ

నిన్నటి వరకు హైడ్రా, బుల్డోజర్లపై ఆరోపనలు ప్రత్యారోపనలు వేడెక్కిన రాజకీయం..నేడు వ్యక్తిగత ఆరోపనలతో రచ్చకెక్కింది. సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేయడంపై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మీడియాతో భావోద్వేగంతో కంట తడి పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆమెపై పలు వ్యాఖ్యలు చేశారు. అమెపై సోషల్‌ మీడియాలో వచ్చిన పోస్టులతో తమకు సంబందం లేదని, కొండా సురేఖ ఏడిస్తే తమకు సంబంధం లేదన్నారు. గతంలో మాట్లాడిన బూతులు గుర్తుకు తెచ్చుకోవాలని … Read more

ఎల్‌ఎండీకి పర్యాటక శోభ

గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల పర్యాటకులను కనువిందుకు చేస్తున్న దృష్యాలు కరీంనగర్‌-జనత న్యూస్‌ పర్యాటక శోభ సంతరించుకుంది కరీంనగర్‌ దిగువ మానేరు ప్రాజెక్టు. ఎల్‌ఎండీ పూర్తి స్థాయి నీటి మట్టం 24 టీఎంసీలు కాగా..ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిండింది. జలాశయం నిండడంతో మిడ్‌ మానేరు ప్రాజెక్టు నుండి ఎల్‌ఎండీ లోకి వస్తున్న నీటిని దిగువకు వదులాల్సి వచ్చింది. దీంతో రిజర్వాయర్‌ వద్ద రెండు గేట్లు ఎత్తి మూడు వేల క్యూసెక్కుల నీటిని వదిలారు అధికారులు. మిడ్‌ … Read more

డీఎస్సీ ఫలితాలెప్పుడు ?

జనత న్యూస్‌ : తెలంగాణ డీఎస్‌సీ ఫలితాలు మరింత ఆలస్యమయ్యేలా కనబడుతున్నాయి. ఈ నెల 6న విద్యాశాఖ విడుదల చేసిన ‘కీ’ పై అభ్యర్థుల నుండి భారీగా అభ్యంతరాలు వచ్చాయి. వాటిపై విద్యాశాఖ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. దీనికి తోడు న్యాయపరమైన చిక్కులు రాకుండా, ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. నిపుణుల కమిటీ పరిశీలించాకే ఫలితాలు ప్రకటించే ఛాన్స్‌ ఉంది. డీఎస్‌సీ, టెట్‌ మార్క్స్‌ కలిపి వెలువడే ర్యాంకుల వివరాల కోసం అభ్యర్థులు … Read more

బతుకమ్మ చీరలకు బదులుగా..

మరో పథకం.. మహిళా సంఘ సభ్యులకు చీరలు                                                                                        804.64 కోట్ల వస్త్రోత్పత్తికి సీఎం ఆదేశాలు ఇక … Read more

చేనేత రుణమాఫీకి గ్రీన్‌ సిగ్నల్‌

రూ. 30 కోట్లకు పైగా నేతన్నలకు లబ్ధి సహకార సంఘాల క్యాష్‌ క్రెడిట్‌.. ముద్ర లోన్స్‌ మాఫీ అయ్యే అవకాశాలు ముందే చెప్పిన ‘జనత ’ దిన పత్రిక జనత న్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి తెలంగాణలో చేనేత రుణమాఫీకి పచ్చ జెండా ఊపింది కాంగ్రెస్‌ సర్కారు. హైదరాబాద్‌లో ఐఐహెచ్‌టీ ప్రారంభ సభలో సంబంధిత అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత … Read more

హామీలు అమలు చేయలేకే.. ఈ ‘హైడ్రా’మా !

పేదల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదు బీఆర్‌ఎస్‌కు ప్రజల నుండి నో ఎంట్రీ బోర్డులు కేంద్ర మంత్రి బండి సంజయ్‌.. కరీంనగర్‌-జనత న్యూస్‌ ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు హైడ్రా పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌. కరీంనగర్‌లో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల శంకర్‌, జిల్లా అధ్యక్షులు గంగడి క్రిష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె … Read more

పక్కదారి పట్టించేందుకే వక్రీకరణలు

చెప్పిందొకటి- ప్రచారం మరొకటి కేసుల మాఫీకే కొందరి కొత్త నాటకం.. ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్‌-జనత న్యూస్‌ కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ పై వ్యాఖ్యలను వక్రీకరిస్తూ కొందరు తప్పుడు ప్రచారాలకు పూనుకుంటున్నారని మానకొండూర్‌ శాసనసభ్యులు డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారంనాడు పత్రికలకు ఒక ప్రకటన జారీచేశారు. కరీంనగర్‌ సీపీ పై తాను చేసిన ఆరోపణలపై కాకుండా చేయని ఆరోపణలను చేసినట్టుగా దుష్ప్రచారం సాగిస్తున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్‌ సిపి … Read more

కొట్లాడండి…గళం విప్పండి..

తలుచుకుంటే సర్కార్‌ తలరాతలే మారతాయి కాంగ్రెస్‌ కు ఓట్లేస్తే టీచర్లకు ఏం ఒరిగింది? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ గురుపూజోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు కరీంనగర్‌-జనత న్యూస్‌ రోడ్లపైకొచ్చి కొట్లాడండి..విద్యార్థుల సమస్యలపై గళం విప్పండని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌. కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఆడిటోరియంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయ సమస్యలపై తాను పోరాడి జైలుకెళ్లానని, ఎన్నికల్లో మాత్రం … Read more

తెలంగాణలో రెండు రోజులు వర్షాలు

జనత న్యూస్‌ : తెలంగాణలో సోమ, మంగళ వారాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం కొమరంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు..ఆదిలాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, భద్రాద్రి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో కొద్దిపాటి వర్షాలు పడుతాయని పేర్కొంది. మంగళవారం ఆదిలాబాద్‌ జిల్లాలో … Read more