Thursday, October 1, 2026

చిన్నారుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది

– బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం

కరీంనగర్, అక్టోబర్ 1 (జనతా న్యూస్): చిన్నారుల సంక్షేమం, మహిళా శిశు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం అన్నారు. ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా గురువారం బీజేపీ వెస్ట్ జోన్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని ఓ అంగన్వాడీ కేంద్రాన్ని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి సందర్శించారు.

ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో అందుతున్న సేవలను పరిశీలించి చిన్నారులతో ముచ్చటించారు. వారికి పండ్లు పంపిణీ చేసి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలను సన్మానించారు. చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్య, ఆరోగ్య సేవలు అందిస్తున్న అంగన్వాడీ సిబ్బంది సేవలను అభినందించారు.

అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడం, గర్భిణీలు, బాలింతల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అంగన్వాడీ కేంద్రాలను సాంకేతికతతో అనుసంధానం చేయడంతో పాటు మౌలిక వసతులు మెరుగుపరచడం, తాగునీరు, ఆటవస్తువులు వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ, పాలనాపరమైన ప్రస్థానం, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. ప్రధానమంత్రి మాతృ వందన యోజన ద్వారా గర్భిణీలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో బీజేపీ వెస్ట్ జోన్ అధ్యక్షుడు జాడి బాల్‌రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.

బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరికలు

కరీంనగర్ పట్టణం 13వ డివిజన్‌కు చెందిన గంగిపల్లి అంజలి, ఉస్మాన్‌పురకు చెందిన డాక్టర్ లతా విశ్వజన్ గురువారం బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

నారాయణపూర్‌పై కలెక్టర్‌ క్షేత్రస్థాయి పరిశీలన

గ్రామస్తులకు 100 శాతం న్యాయం చేస్తాం.. అపోహలు, ఆందోళనలు వద్దుపది శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీ.. ప్రభుత్వానికి సమగ్ర నివేదికఅభ్యంతరాలుంటే రాతపూర్వకంగా ఇవ్వండి: కలెక్టర్‌ చిత్రా మిశ్రా

చిన్నారుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది

– బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం కరీంనగర్, అక్టోబర్ 1 (జనతా న్యూస్): చిన్నారుల సంక్షేమం, మహిళా...

కూల్‌డ్రింక్ సీసాలపై తుప్పు.. 60 కేసులు స్వాధీనం

ఆహార భద్రతా శాఖ తనిఖీల్లో గుర్తింపు శాఖ అధికారుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

పర్యావరణ పరిరక్షణతోనే ప్రజాహితం

తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ కత్తి శ్రీనివాస్ స్వచ్ఛత సేవా కార్యక్రమంలో భాగంగా మొక్కలు...

Most Popular

You cannot copy content of this page