Thursday, October 1, 2026

నారాయణపూర్‌పై కలెక్టర్‌ క్షేత్రస్థాయి పరిశీలన

గ్రామస్తులకు 100 శాతం న్యాయం చేస్తాం.. అపోహలు, ఆందోళనలు వద్దు
పది శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీ.. ప్రభుత్వానికి సమగ్ర నివేదిక
అభ్యంతరాలుంటే రాతపూర్వకంగా ఇవ్వండి: కలెక్టర్‌ చిత్రా మిశ్రా

కరీంనగర్‌, అక్టోబర్‌ 1 (జనతా న్యూస్‌): నారాయణపూర్‌ రిజర్వాయర్‌ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులకు 100 శాతం న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా తెలిపారు. గ్రామస్తులు ఎలాంటి అపోహలు, ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతో ఇటీవల గ్రామస్తులతో సమావేశమైన కలెక్టర్‌.. గురువారం అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో షర్మిల, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రాజేశ్వరి, గంగాధర తహసీల్దార్‌ రజిత తదితర అధికారులతో కలిసి నారాయణపూర్‌ రిజర్వాయర్‌ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.గ్రామంలో సుమారు 350 కుటుంబాలపై రిజర్వాయర్‌ ప్రభావం, భూసేకరణ, సాగు భూములు, ఇళ్లు, ఆరోగ్య కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రాలు, ఇతర ప్రజా సౌకర్యాల పరిస్థితిపై వివరాలు సేకరించారు. కార్యాలయ రికార్డులతో పాటు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.పది శాఖలతో ప్రత్యేక కమిటీనారాయణపూర్‌ సమస్యపై సమగ్ర అధ్యయనం చేసేందుకు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. నీటిపారుదల, వ్యవసాయం, భూగర్భ జలాలు, పంచాయతీరాజ్‌, రెవెన్యూ, భూ సర్వే తదితర శాఖల అధికారులు కమిటీలో భాగస్వాములు కానున్నారు.రిజర్వాయర్‌ వల్ల ఎంత మేరకు ముంపు ప్రభావం ఏర్పడుతుంది, ఎన్ని కుటుంబాలు, సాగు భూములు, ఇళ్లు ప్రభావితమయ్యే అవకాశం ఉందనే అంశాలను కమిటీ పరిశీలించనుంది. చర్లపల్లి, మంగపేట గ్రామాల్లోనూ రిజర్వాయర్‌ ప్రభావాన్ని పరిశీలిస్తామని తెలిపారు.అభ్యంతరాలు రాతపూర్వకంగా ఇవ్వాలిభూసేకరణకు సంబంధించి గ్రామస్తులకు ఏవైనా అభ్యంతరాలు, సందేహాలు ఉంటే అధికారులకు రాతపూర్వకంగా సమర్పించాలని కలెక్టర్‌ సూచించారు. ప్రతి అభ్యంతరాన్ని పరిశీలించి నిబంధనల ప్రకారం న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.భూసేకరణ ప్రక్రియలో జిల్లా యంత్రాంగానికి గ్రామస్తులు సహకరించాలని కోరారు. గ్రామస్తుల నుంచి అవసరమైన వివరాలు సేకరించి, ముంపు ప్రభావం, భూసేకరణ, సాగు భూములు, ఇళ్లు, ప్రజా సౌకర్యాలపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు.ఎమ్మెల్యే చొరవతో పరిశీలననారాయణపూర్‌ సమస్యను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సంబంధిత మంత్రులతో చర్చించినట్లు తెలిపారు. గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలనే అంశంపై గ్రామస్తుల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో కలెక్టర్‌ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు.గ్రామస్తులు శాంతియుత వాతావరణంలో తమ సమస్యలను అధికారులకు వివరించారు. వాస్తవ పరిస్థితులను పూర్తిస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని కలెక్టర్‌ చిత్రా మిశ్రా తెలిపారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

నారాయణపూర్‌పై కలెక్టర్‌ క్షేత్రస్థాయి పరిశీలన

గ్రామస్తులకు 100 శాతం న్యాయం చేస్తాం.. అపోహలు, ఆందోళనలు వద్దుపది శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీ.. ప్రభుత్వానికి సమగ్ర నివేదికఅభ్యంతరాలుంటే రాతపూర్వకంగా ఇవ్వండి: కలెక్టర్‌ చిత్రా మిశ్రా

చిన్నారుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది

– బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం కరీంనగర్, అక్టోబర్ 1 (జనతా న్యూస్): చిన్నారుల సంక్షేమం, మహిళా...

కూల్‌డ్రింక్ సీసాలపై తుప్పు.. 60 కేసులు స్వాధీనం

ఆహార భద్రతా శాఖ తనిఖీల్లో గుర్తింపు శాఖ అధికారుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

పర్యావరణ పరిరక్షణతోనే ప్రజాహితం

తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ కత్తి శ్రీనివాస్ స్వచ్ఛత సేవా కార్యక్రమంలో భాగంగా మొక్కలు...

Most Popular

You cannot copy content of this page