హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో బెజ్జంకి వాసి మృతి

హైదరాబాద్, జనత న్యూస్: హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలం కోటపల్లి గ్రామానికి చెందిన అజయ్ మృతి చెందాడు. హైదరాబాద్ లోని దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాణిగంజ్ నుంచి ట్యాంక్ బండ్ మీదుగా వెళ్తున్న సమయంలో తన బైక్ ను ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో అజయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అజయ్ బోయిన్ పల్లిలోని అంజయ్యనగర్ లో నివాసం ఉంటూ శ్రీకర ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు.

అర్థరాత్రి అక్రమ ఇసుక దందా..

బెజ్జంకి మండలంలో ఇసుకసూరుల ఇష్టారాజ్యం మామూళ్ల మత్తులో అధికారులు? బెజ్జంకి,జనత న్యూస్:జన సంచారం లేని సమయంలో ఇసుకసూరులు శుక్రవారం అర్థరాత్రి ఇసుక దందా జోరుగా సాగిస్తున్నారు.అడ్డు అదుపులేకుండా సాగిస్తున్న ఇసుకసూరులకు ఎవరి అండదండలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్రమాలకు,దోపిడికి అడ్డుకట్ట పడుతుందని బావిస్తున్న ప్రజలకు నిరాశే మిగులుతుంది. అధికారులు చట్టపరమైన చర్యలు చేపట్టి అక్రమ ఇసుక రవాణను నియంత్రిస్తారనే ఆశలు అడియాశలవుతున్నాయి.అధికారులు అక్రమ ఇసుక సాగుతున్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.అక్రమ ఇసుక … Read more

బెజ్జంకి: కాంగ్రెస్ లో భారీగా చేరికలు

Congress: జనత న్యూస్ బెజ్జంకి: బెజ్జంకి మాజీ రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ఒoటేల సంపత్ రెడ్డి ని బుధవారం ఎల్ఎండి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. సుమారు 200 మంది అనుచరులతో బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా సంపత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలకు ఆకర్షితుడైన ఎమ్మెల్యే కవ్వం పల్లి సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ … Read more

కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు

జనత న్యూస్ బెజ్జంకి : మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలో మార్నింగ్ వాక్ చేస్తూ వాడ వాడ తిరుగుతూ గ్రామంలోని సమస్యలతో పాటు ప్రజల వ్యక్తిగత సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి హామీ ఇస్తూ, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావును ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కేంద్రంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు జరిగితే రాష్ట్రానికి సరిపడా … Read more

బెజ్జంకి: గ్రామ సమస్యలపై ఎమ్మెల్యే కు కాంగ్రెస్ నాయకుడి వినతి

బెజ్జంకి, జనత న్యూస్: సిద్దిపేట జిల్లా బెజ్జంకి గ్రామ పంచాయతీ పరిధిలో అనేక సమస్యలను పరిష్కరించాలని, .రోడ్డు నుంచి డ్రైనేజీ వరకు సక్రమంగా లేకపోవడంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారుని ఈ మేరకు గ్రామ సమస్యలు పరిష్కరించాలని బెజ్జంకి కాంగ్రెస్ పార్టీ నాయకుడు తిప్పారపు మల్లేశం వివిధ సమస్యల గురించి వివరిస్తూ మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను వినతి పత్రం ద్వారా కోరారు. ఈ సందర్భంగా ఆయన పలు సమస్యలను వినతి పత్రంలో పొందుపర్చారు. బెజ్జంకిలోని లక్ష్మీనరసింహా … Read more

కన్నుల పండుగగా లక్ష్మీ నరసింహుడి నాగవెల్లి మహోత్సవం

జనత న్యూస్ బెజ్జంకి : బెజ్జంకి మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవంలో భాగంగా గురువారం స్వామివారి నాగవెల్లి మహోత్సవాన్ని అశేష జనవాహిని సమక్షంలో, వేద పండితులు కనులు పండువగా నిర్వహించారు. నాగవెల్లి మహోత్సవానికి బెజ్జంకి గ్రామ ప్రజలతోపాటు  వివిధ గ్రామాల ప్రజలు హాజరై  నాగవల్లి మహోత్సవాన్ని కనులారా చూసి తరించారు.

రమణీయం.. నరసింహుడి శకటోత్సవం..

జనత న్యూస్ బెజ్జంకి : బెజ్జంకి మండల కేంద్రంలో ప్రతి ఏటా చైత్రమాసంలో నిర్వహించే శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర మహోత్సవంలో భాగంగా మంగళవారం శకటోత్సవం ( బండ్లు తిరుగుట) కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బెజ్జంకి పోలీస్ సిబ్బంది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బెజ్జంకి గ్రామ ప్రజలతోపాటు చుట్టుపక్కల్లోని వివిధ గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎడ్లబండ్లతో పాటు మేకపోతుల బండి … Read more

బెజ్జంకి: ఆగని ప్రజా నిరసనలు

జనతన్యూస్ బెజ్జంకి : బెజ్జంకి మండలం నరసింహులపల్లి పోతారం గ్రామాల మధ్య నిర్మించ తలపెట్టిన ఇథనాల్ పరిశ్రమ ను నిర్మించవద్దని గత కొన్ని రోజుల నుండి ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం విధితమే అయితే మంగళవారం పరిశ్రమ యాజమాన్యాలు భూసార పరీక్షల నిమిత్తం అధికారులతో కలిసి గ్రామంలోకి రావడంతో పెద్ద ఎత్తున ప్రజలు వారిని అడ్డుకొని నిరసన తెలిపారు. బెజ్జంకి ఎస్ ఐ జి.కృష్ణారెడ్డి భూసార పరీక్షల నిమిత్తం వారు వచ్చినట్లు పరీక్షలు … Read more

 రెచ్చిపోతున్న ఇసుకాసురులు!

తిలా పాపం తలా పిడికెడు…  కంచే చేను మేస్తున్నట్టుగా అధికారుల తీరు?  అడ్డూఅదుపులేని ఇసుక దందా (యాంసాని శివకుమార్ -జనత న్యూస్ ప్రతినిధి) ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని బెజ్జంకి మండలంలో ఇసుక మాఫియా బరితెగిస్తోంది. మండలంలోని మోయతుమ్మెద వాగు ఇసుకాసురులకు కామధేనువుగా మారింది. ఎవ్వరూ ఊహించని రీతిలో భారీగా జరుగుతున్న దందాలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకుల హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. వివిధ శాఖల అధికారులకు పెద్దఎత్తున అమ్యామ్యాలు ముట్టుతుండడంతో ఏ ఒక్కరు … Read more

పోలీసుల పహారా మధ్య ఇథనాల్ పరిశ్రమకు భూమి పూజ

 తీవ్రంగా వ్యతిరేకించిన సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తిప్పారం శ్రీనివాస్. జనతన్యూస్ బెజ్జంకి : బెజ్జంకి మండలం నరసింహులపల్లి పోతారం గ్రామాల మధ్య ఏర్పాటు చేస్తున్నటువంటి ఇథనాల్ పరిశ్రమను ఆయా గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ యాజమాన్యాలు పోలీసు బందోబస్తు మధ్యన ప్రజాభిషానికి వ్యతిరేకంగా శుక్రవారం భూమి పూజ చేసినట్లు తమ పార్టీ దృష్టికి వచ్చిందని బెజ్జంకి మండలం సిపిఎం పార్టీ కార్యదర్శి తిప్పారం సురేష్ శనివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో చర్చించారు.ఆయా గ్రామాల ప్రజలకు న్యాయం … Read more