బెజ్జంకి, అక్టోబర్ 4, జనతా న్యూస్: బెజ్జంకి మండల వార్డు సభ్యుల ఫోరం అత్యవసర సమావేశం ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల వార్డు సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకోగా, ఫోరం అధికార ప్రతినిధిగా లింగాల అర్జున్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ వార్డు సభ్యుల సమస్యల పరిష్కారానికి, గ్రామాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఫోరం బలోపేతానికి సహకరిస్తానని పేర్కొంటూ, తన ఎన్నికకు సహకరించిన వార్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.


