బిఆర్ఎస్ నాయకులు మల్లికార్జున్రెడ్డి హుస్నాబాద్,జనత న్యూస్: ప్రజల దృష్టిని మళ్లించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవెళ్లి ప్రాజెక్టుపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోందని, ప్రాజెక్టును ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని బిఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘తమ ప్రభుత్వం రాగానే నెల రోజుల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తాం’ అని మైకులు పట్టుకుని ఉపన్యాసాలు ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు, అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడిచినా కనీసం తట్టెడు మట్టి కూడా పోయలేదని మండిపడ్డారు. సమీక్షల పేరుతో ప్రభుత్వం కేవలం కాలయాపన చేస్తోందే తప్ప క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు జరగడం లేదని విమర్శించారు.ఇప్పటివరకు పరిహారం అందుకోని భూనిర్వాసితులను పిలిపించి మాట్లాడే ఉద్దేశం కూడా ప్రభుత్వానికి లేకపోవడం దారుణమని అన్నారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్వాసితుల పోరాటాలకు మద్దతుగా నిలిచి, అధికారంలోకి రాగానే వారి డిమాండ్లను నెరవేరుస్తామని ఇచ్చిన హామీలను నీరుగార్చారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పదవీకాలం ఇంకా రెండు సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉందని, మిగిలిన ఈ సమయంలో ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నించారు.హుస్నాబాద్ మెట్ట ప్రాంతంలో సాగునీరు లేక రైతులు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా కాకపోయినా, కనీసం నీటిని నింపితే భూగర్భ జలాలు పెరిగి రైతులకు కొంతమేరైనా ఊరట లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి, భూనిర్వాసితులకు అందాల్సిన నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించి, గౌరవెళ్లి ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
బిఆర్ఎస్ నాయకులు మల్లికార్జున్రెడ్డిహుస్నాబాద్,జనత న్యూస్: ప్రజల దృష్టిని మళ్లించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవెళ్లి ప్రాజెక్టుపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోందని, ప్రాజెక్టును ఎన్ని...
బెజ్జంకి, అక్టోబర్ 4, జనతా న్యూస్: బెజ్జంకి మండలం గూడెం గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఆదివారం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని...