బెజ్జంకి, అక్టోబర్ 4, జనతా న్యూస్: పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ, బెజ్జంకిలో గెస్ట్ స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేటర్ పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
బీఈడీతో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా చేసిన వారు ఈ పోస్టుకు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.16,500 గౌరవ వేతనం అందిస్తామని తెలిపారు. ఈ నియామకం నవంబర్ 2026 నుంచి ఏప్రిల్ 2027 వరకు ఉంటుందని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 5 నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


