Sunday, October 4, 2026

బెల్ట్‌ ‘హోరు’.. మత్తు జోరు!

గ్రామాల్లో ఇష్టారాజ్యంగా మద్యం విక్రయాలు.. శాంతిభద్రతలకు విఘాతం
పోలీసులు, ఎక్సైజ్‌ అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం

చిగురుమామిడి, జనతా న్యూస్: చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో బెల్ట్‌ షాపుల ద్వారా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రివేళల్లోనూ మద్యం అందుబాటులో ఉండటంతో గ్రామాల్లో గొడవలు, అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

చిన్న తగాదా.. తీవ్ర రక్తపాతం

రేకొండ గ్రామంలో శనివారం రాత్రి వ్యక్తిగత కక్షల నేపథ్యంలో పంకేర్ల రాజు అనే వ్యక్తి బీరు సీసాతో దాసరి సాగర్‌రెడ్డిపై దాడి చేసినట్లు ఎస్‌ఐ జగదీశ్వర్‌ తెలిపారు. ఈ ఘటనలో సాగర్‌రెడ్డి తలకు తీవ్ర గాయమై, రక్తస్రావం కావడంతో కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రాజుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

‘ఏటీఎం’లా మద్యం లభ్యత

గ్రామాల్లో వేళాపాళా లేకుండా మద్యం అందుబాటులో ఉండటంతో బెల్ట్‌ షాపులు ‘ఏటీఎం’లను తలపిస్తున్నాయని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. మద్యం మత్తులో తరచూ గొడవలు జరుగుతుండటంతో మహిళలు, వృద్ధులు రాత్రివేళల్లో బయటకు రావడానికి భయపడుతున్నారని చెబుతున్నారు. యువత మద్యానికి బానిసయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు స్పందించాలని డిమాండ్‌

బెల్ట్‌ షాపులపై చర్యలు తీసుకోవాలని గతంలో పలుమార్లు ఫిర్యాదులు చేసినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మండలంలోని గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, రాత్రివేళల్లో పోలీసు పెట్రోలింగ్‌ పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

గౌరవెళ్లి ప్రాజెక్టు సమీక్షలు ప్రజలను మభ్యపెట్టడానికే

బిఆర్ఎస్ నాయకులు మల్లికార్జున్‌రెడ్డిహుస్నాబాద్,జనత న్యూస్: ప్రజల దృష్టిని మళ్లించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవెళ్లి ప్రాజెక్టుపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోందని, ప్రాజెక్టును ఎన్ని...

ఆలయ కమిటీ ఎన్నిక

తిమ్మాపూర్, జనతా న్యూస్ తిమ్మాపూర్ మండలంలోని మహాత్మనగర్ శ్రీశ్రీశ్రీ తాపాల లక్ష్మీనృసింహాస్వామి ఆలయ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు....

గూడెం గ్రామంలో పరిసరాల పరిశుభ్రత

బెజ్జంకి, అక్టోబర్ 4, జనతా న్యూస్: బెజ్జంకి మండలం గూడెం గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఆదివారం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని...

మృతురాలి కుటుంబ సభ్యుల పరామర్శ

బెజ్జంకి, అక్టోబర్ 4, జనతా న్యూస్: బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన నాంపల్లి పద్మ (43) అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు....

Most Popular

You cannot copy content of this page