విజయవాడ, జనతా న్యూస్: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి అధికారం పార్టీ వైసీపీ అధినేత సీఎం జగన్ రెడీ అయిపోయారు. ఈనెల 27వ తేదీ నుంచి ‘మేమంతా సిద్ధం’ పేరుతో తొలి విడత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన బస్సు యాత్ర తో ప్రజల్లోకి వెళ్ళనున్నారు. కడప జిల్లాలోని ఇడుపులపాయ నుంచే వైయస్ జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. బస్సుయాత్ర కంటే ముందు ఇడుపులపాయలు వైయస్సార్ ఘాట్ ను జగన్ సందర్శించనున్నారు. అక్కడ వైఎస్సార్ కు నివాళులు అర్పించి అనంతరం అక్కడి నుంచి బస్సు యాత్ర మొదలు పెడతారు. ఈ యాత్ర పులివెందు, కమలాపురం నియోజకవర్గాల మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకుంటుంది. ప్రొద్దుటూరులో తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. మార్చి 28న నంద్యాల, 29న కర్నూలు, హిందూపురం పార్లమెంటు స్థానాల పరిధిలో బస్సు యాత్ర కొనసాగనుంది.
YCP In Andhrapradesh ఎన్నికల సమరానికి వైసీపీ ‘సిద్ధం’.. తొలి బహిరంగ సభ అక్కడే…
- Advertisment -