మానకొండూర్ ప్రతినిధి, జనత న్యూస్: అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నానని, ప్రజల సమస్యల సాధన కొరకు ఏనాడు వెనకాడ లేదని, అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మానకొండూర్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి ఆరేపల్లి మోహన్ స్పష్టం చేశారు. ఆయన సోమవారం మానకొండూరు మండల కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఓటమితో తాను పొంగిపోవడం లేదని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తమ పార్టీ రాబట్టుకోవటంలో విఫలం చెందిందని అన్నారు.
నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ఆయన అభినందనలు తెలిపారు. తన గెలుపు తన గెలుపు కోసం కృషిచేసిన ప్రతి బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ఆయనకు కృత్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ మార్పును బలంగా కోరుకున్నారని బి.ఆర్.ఎస్ పాలనకు చరమగీతం పాడాలని నిర్ణయించుకున్నారని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నెరవేస్తుందని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల జగన్ రెడ్డి ఏనుగుల అనిల్ సమ్మిరెడ్డి తదితరులు ఉన్నా