Monday, October 26, 2026

వేగిరంగా కాలువను పునరుద్దరించాలి

వరద సహాయక పనుల్లో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి బిజీ
ఖమ్మం-జనత న్యూస్‌
పాలేరు ఎడమ కాల్వ గండి పూడిక పునరుద్ధరణ పనులలో వేగం పెంచాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్‌, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం హట్యాతండా వద్ద పాలేరు ఎడమ కాల్వ గండి ప్రదేశంలో జరుగుతున్న పునరుద్ధరణ పనుల తీరును ఆయన పరిశీలించారు. పాలేరు ఎడమ కాల్వ గండి పూడిక తీత పనుల వివరాలు, తాత్కాలికంగా చేపడుతున్న పనులు, శాశ్వత పునరుద్ధరణ పనులపై అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం రైతులకు సాగునీరు అందించడానికి చేపట్టిన పనుల్లో వేగం పెంచాలని ఇంజనీరింగ్‌ అధికారులకు మంత్రి సూచించారు. గండి పూడిక పనులు 24 గంటల పాటు జరగాలని, అవసరమైన మేర అదనపు యంత్రాలు, షిఫ్టులవారీగా కార్మికులు పనిచేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కాల్వ తవ్వకం, లైనింగ్‌ పనులు సమాంతరంగా జరగాలని మంత్రి అధికారులకు సూచించారు. మంత్రి వెంట ఇరిగేషన్‌ సిఇ విద్యాసాగర్‌, ఎస్‌ఇ నర్సింగ రావు, సంబంధిత అధికారులు ఉన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page