కరీంగనర్, జనతా న్యూస్: విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వీణవంక తహసీల్దార్ తిరుమలరావు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికాలో ఉంటున్న రామిడి శివప్రియకు చెందిన సర్వేనెంబర్ 1224/A భూమిని ధరణి నిబంధనలు ఉల్లంఘించి సుకాసీ సురేష్ అనే వ్యక్తికి పట్టా మార్పిడి చేశారు. అయితే తాను విధుల్లో ఉండగా ధరణి ఆపరేటర్ అరుణ్ చౌదరి, సుకాసి సురేశ్, సాక్షులు నీల పున్నం చందర్, అక్బర్ లు కలిసి అక్రమంగా పట్టా మార్పిడు చేశారని తహసీల్దార్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కానీ దీనికి బాధ్యులుగా తహసీల్దార్ ను చేస్తూ ఆయనను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
వీణవంక తహసీల్దార్ సస్పెండ్.. ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్
- Advertisment -