హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు తీపి కబురు అందించింది. ఇప్పటికే పలు పథకాలను ప్రకటించి ఆకట్టుకుంటున్న ఈ సంస్థ తాజాగా మరో ఆఫర్ ప్రకటించింది. ఎక్స్ ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్ పాస్ తీసుకునే వారికి ఇది ఉపయోగపడనుంది. ఎక్స్ ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్ పాస్ ఉన్నవారు ఇకపై డీలక్స్ బస్సుల్లో కూడా ప్రయాణించే సదుపాయం కల్పిస్తున్నట్టు టిఎస్ఆర్టిసి ఎండి విసి సజ్జనార్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. తెలంగాణ ఆర్టీసీ ఎండిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సజ్జనార్ ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునేందుకు పలు విధానాలుగా ప్రయత్నిస్తున్నారు. ప్రతిసారి సరికొత్త పథకాన్ని ప్రకటిస్తున్నారు. తాజాగా ఎం ఎస్ టి పాస్ కలిగిన వారు రూ.20 కాంబినేషన్ టికెట్ తీసుకొని డీలక్స్ బస్సుల్లో ప్రయాణించవచ్చని సజ్జనార్ తెలిపారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ ఆఫర్ ఎక్స్ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్ పాస్ ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుందని సజ్జన పేర్కొన్నారు. ఎం ఎస్ టి పాస్ ఉన్న ప్రయాణికులు ఈ కాంబినేషన్ టికెట్ ఫెసిలిటీని సద్వినియోగం చేసుకోవచ్చని అన్నారు.
ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్
- Advertisment -