జనత న్యూస్ బెజ్జంకి : అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా బెజ్జంకి మండల కేంద్రములో శుక్రవారం స్వేరోస్ నెట్ వర్క్ అధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ని మహిళ సిబ్బందిని, బెజ్జంకి పోలీస్ స్టేషన్లోని మహిళ కానిస్టేబుళ్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఉప్పులేటి బాబు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. స్త్రీ అబల కాదు సబల అని నిరూపిస్తున్నారు, ఈ రోజులలో అనేకమంది స్త్రీమూర్తులు, ఇది చాలా సంతోషదాయకమైన విషయమని పేర్కొన్నారు. స్త్రీ సహధికారిత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక బెజ్జంకి మండల ఎస్సై కృష్ణ రెడ్డి మరియు సిద్దిపేట జిల్లా స్వేరోస్ నెట్వర్క్స్ అధ్యక్షులు ఉప్పులేటి బాబు, కవ్వంపెల్లి యువసేన అధ్యక్షులు కత్తి రమేష్, బ్లాక్ కాంగ్రెస్ -2 ఉపాధ్యక్షులు లింగాల శ్రీనివాస్, వొరగంటి యువసేన నిర్వాహకులు బొనాగిరి (కొత్త) రాజు కుమారు, ఉప్పులేటి శ్రీనివాస్, స్వేరో నాయకులు ఆనంద్, బెజ్జంకి శ్రీనివాస్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రి మహిళా సిబ్బందికి సన్మానం
- Advertisment -