Tollywood: టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు తాజాగా కొందరిపై ఫైర్ అయ్యారు. తన పేరును కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాురు. సోషల్ మీడియా వేదికగా మోహన్ బాబుపై కొందరు పోస్టులు పెట్టడాన్ని గమనించిన ఆయన తాజాగా అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘కొందరు ఈ మధ్య కాలంలో నా పేరుతో రాజకీయం చేస్తున్నారు. స్వ ప్రయోజనాల కోసం నా పేరు తీయకూడదని కోరుతున్నా.. మనం అనేక రకాల భావాలున్న వ్యక్తుల మధ్య జీవిస్తున్నాం.. వీలైతే నలుగురికి సాయం చేయండి.. లేదా వారితో మంచిగా మెలగండి.. కానా నా పేరుమీద రాజకీయం చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. రాజకీయాల్లో నా పేరు వాడడం బాధాకం’ అని మోహన్ బాబు తెలిపారు.
Tollywood: వారికి వార్నింగ్ ఇచ్చిన మోహన్ బాబు
- Advertisment -