Tollywood: మెగాహీరో రామ్ చరణ్ నటించిన ఫస్ట్ అండ్ హిట్ మూవీ చిరుత గురించి మెగా ఫ్యాన్స్ ఎవరూ మర్చిపోరు. ఈ సినిమాలో చెర్రీ ఫస్ట్ సినిమా అయినా ఏమాత్రం బెదురు లేకుండా నటించి ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు. ఇందులో అందాల బ్యూటీగా నటించిన నేహా శర్మ అందరికీ గుర్తుండే ఉంటుంది. నేహా శర్మ చిరుత తరువాత కుర్రాడు అనే సినిమాలో కనిపించింది. ఆ తర్వాత ఈ భామ మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. అయితే ఈమె ప్రస్తుతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. బీహార్ లోని భగల్పూర్ లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందని ఆమె తండ్రి స్థానిక ఎమ్మెల్యే అజిత్ శర్మ తెలిపారు. మిత్రపక్షాల స్థానాల సర్దుబాటులో భాగంగా భగల్పూర్ సీటు కాంగ్రెస్ కు వస్తుందని ఆయన అనుకుంటున్నారు. అదే జరిగితే తన కుమార్తెను అభ్యర్థిగా నామినేట్ చేయాలని పార్టీని కోరునున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Tollywood: లోక్ సభ బరిలో ‘చిరుత’ హీరోయిన్?
- Advertisment -