ఈ ఐపీఎల్ సీజన్లో ప్రతి జట్టుకు ప్రతి మ్యాచ్ కీలకం అవుతందోి. ఇందులో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ కు ఈ మ్యాచ్ చావరేవో లాంటిది. ఈ మ్యాచ్లో ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచ్ లు గుజరాత్ ఓడిపోయింది. ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై వరుసగా రెండు ఓటములు ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం మంచి ఫామ్ లో ఉంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్లో 6 విజయాలు సాధించింది. మరో మూడు మ్యాచ్లో రెండు గెలిచినా ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంటుంది. ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్ కు వెళ్లాలని చూస్తోంది. దీంతో రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది.
నేడు గుజరాత్ వర్సెస్ చెన్నై.. ఇరు జట్లకూ కీలక మ్యాచ్
- Advertisment -