Monday, October 26, 2026

డీజీపీకి కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఫోన్‌

ఆదివాసీ మహిళపై లైంగిక దాడిపై ఆరా
విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సూచన
ఢిల్లీ :
తెలంగాణ డీజీపీ జితేందర్‌కు ఫోన్‌ చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌. ఆదిలాబాద్‌ జిల్లా జైనూర్‌లో తలెత్తిన ఉద్రిక్తత పరిస్థితులకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 31న జైనూర్‌ మండలం దేవుగూడకు చెందిన ఆదివాసీ మహిళ (45)పై ఆటోడ్రైవర్‌ షేక్‌ మగ్దూం లైంగిక దాడికి యత్నించడంతో పాటు తీవ్రంగా గాయపర్చినట్లు ఫిర్యాదు వచ్చిందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తెలిపారు. దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో డీజీపికి ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆదివాసీ మహిళపై లైంగిక దాడితో పాటు దాడి చేసి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా చిత్రీకరించేందుకు కుట్ర చేసిన నిందితుడు షేక్‌ మగ్దూంకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలపై హత్య, అత్యాచారాలకు పాల్పడే వారు ఎంతటివారైనా కఠిన శిక్షలు తప్పవనే సంకేతాలు పంపాలని సూచించారు. అదే సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఆదివాసీ హక్కులకు భంగం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page