హైదరాబాద్, జనత న్యూస్: సీరియల్ నటి పవిత్ర జయరాం గతవారం కారు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆమె మరణాన్ని తట్టుకోలేకపోయిన ప్రియుడు, సహనటుడు చంద్రకాంత్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో చంద్రకాంత్ కుటుంబంలో విషాదం నెలకొంది. దీంతో పవిత్ర జయరాం కారణంగానే తన భర్త చనిపోయాడని చంద్రకాంత్ భార్య చెప్పుకొచ్చారు. ఐదు సంవత్సరాలుగా తన కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని పవిత్రనే తన భర్తను తన వద్దకు రానివ్వకుండా చేసిందని సంచలన ఆరోపణ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై పవిత్ర కూతురు స్పందించారు. తన తల్లిపై అలా మాట్లాడవద్దు అని తెలిపారు. చంద్రకాంత్, పవిత్ర జయరాం మంచి స్నేహితులు అని, వాళ్ళ బంధం గురించి తప్పుగా మాట్లాడకండి అని అన్నారు. తనతో కూడా చందు చాలాసార్లు ఫోన్లో మాట్లాడే వాడని, తల్లిని బాగా చూసుకోవాలని ఎంకరేజ్ చేసేవాడని అన్నారు. తన తల్లి అంతక్రియలకు కూడా చందు హాజరయ్యాడని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పవిత్ర జయరాం కూతురు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వాళ్లు తప్పుచేయలేదు: పవిత్రా జయరాం కూతురు
- Advertisment -