Saturday, October 31, 2026

బేగంపేటలో ఫలించిన నిరుపేదల పోరాటం..

  • ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని తహసీల్దార్ హామీ
  • ఎట్టకేలకు దరఖాస్తుల స్వీకరణ
  •  సంతోషం వ్యక్తం చేసిన నిరుపేద కుటుంబాలు.

జనతా న్యూస్, బెజ్జంకి : బెజ్జంకి మండలం బేగంపేట గ్రామంలోని సుమారు 30 కుటుంబాలు మూడు నెలలుగా ఇంటి స్థలాల కోసం చేస్తున్న న్యాయమైన పోరాటానికి బెజ్జంకి తహసిల్దార్ స్పందించారు. మొత్తానికి బాధితులకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. , వివరాల్లోకి వెళితే .. బేగంపేట గ్రామ రెవెన్యూ శివారు సర్వే నెంబర్ 823 /B విస్తీర్ణంలో ఒక ఎకరా 28 గుంటల స్థలం ఉంది. దీనిని రెండు పడకల గదుల నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కేటాయించారు. దీంతో ఇక్కడ 35 ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదట 25 ఇళ్ల నిర్మాణం కోసం 2018 సంవత్సరంలో శంకుస్థాపన చేశారు. 2019 వ సంవత్సరంలో 25 ఇళ్లకు గాను కోటి 26 లక్షల రూపాయలతో టెండర్ ఖరారు చేశారు. అనివార్య కారణాలతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో 30 కుటుంబాలు నిరుత్సాహానికి గురై అధికారుల చుట్టూ తిరుగుతూ వచ్చారు.

అయితే ఇప్పుడు అదే స్థలంలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వస్తున్న సమాచారంతో ఆ కుటుంబాలు ఐకెపి ఏపీఎంను స్పందించారు. ఆ స్థలంలో వడ్ల సెంటర్ ఏర్పాటు ఆపాలని బుధవారం విన్నవించారు. ఈ విషయం ఐకెపి ఏపీఎం ద్వారా తెలుసుకున్న తహసిల్దార్ గురువారం బేగంపేట పర్యటనకు వచ్చి వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు. ఇండ్లు లేని బేగంపేట కుటుంబాలతో మాట్లాడి కార్యాలయానికి పిలిపించుకున్నారు. ఆ తరువాత వారితో చర్చలు జరిపి ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇస్తూ వారి ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. దీంతో సంతోషం వ్యక్తం చేసిన నిరుపేదలు తాసిల్దార్ బెజ్జంకి, ఐకెపి ఎపిఎం గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page