-
ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని తహసీల్దార్ హామీ
-
ఎట్టకేలకు దరఖాస్తుల స్వీకరణ
-
సంతోషం వ్యక్తం చేసిన నిరుపేద కుటుంబాలు.
జనతా న్యూస్, బెజ్జంకి : బెజ్జంకి మండలం బేగంపేట గ్రామంలోని సుమారు 30 కుటుంబాలు మూడు నెలలుగా ఇంటి స్థలాల కోసం చేస్తున్న న్యాయమైన పోరాటానికి బెజ్జంకి తహసిల్దార్ స్పందించారు. మొత్తానికి బాధితులకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. , వివరాల్లోకి వెళితే .. బేగంపేట గ్రామ రెవెన్యూ శివారు సర్వే నెంబర్ 823 /B విస్తీర్ణంలో ఒక ఎకరా 28 గుంటల స్థలం ఉంది. దీనిని రెండు పడకల గదుల నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కేటాయించారు. దీంతో ఇక్కడ 35 ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదట 25 ఇళ్ల నిర్మాణం కోసం 2018 సంవత్సరంలో శంకుస్థాపన చేశారు. 2019 వ సంవత్సరంలో 25 ఇళ్లకు గాను కోటి 26 లక్షల రూపాయలతో టెండర్ ఖరారు చేశారు. అనివార్య కారణాలతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో 30 కుటుంబాలు నిరుత్సాహానికి గురై అధికారుల చుట్టూ తిరుగుతూ వచ్చారు.
అయితే ఇప్పుడు అదే స్థలంలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వస్తున్న సమాచారంతో ఆ కుటుంబాలు ఐకెపి ఏపీఎంను స్పందించారు. ఆ స్థలంలో వడ్ల సెంటర్ ఏర్పాటు ఆపాలని బుధవారం విన్నవించారు. ఈ విషయం ఐకెపి ఏపీఎం ద్వారా తెలుసుకున్న తహసిల్దార్ గురువారం బేగంపేట పర్యటనకు వచ్చి వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు. ఇండ్లు లేని బేగంపేట కుటుంబాలతో మాట్లాడి కార్యాలయానికి పిలిపించుకున్నారు. ఆ తరువాత వారితో చర్చలు జరిపి ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇస్తూ వారి ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. దీంతో సంతోషం వ్యక్తం చేసిన నిరుపేదలు తాసిల్దార్ బెజ్జంకి, ఐకెపి ఎపిఎం గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.