Sudharshan Setu: తెలంగాణలో తీగల బ్రిడ్జి నిర్మాణం గురించి చాలా మందికి తెలుసు. ఒకటి హైదరాబాద్ లో..మరొకటి కరీంనగర్ లో ఉంది. అయితే దేశంలో అత్యంత పొడవైన తీగల వంతెన ఎక్కడుందో తెలుసా? దీని విశేషాలేంటో తెలుసుకోవాలని ఉందా.. అయితే వివరాల్లోకి వెళితే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ‘సుదర్శన సేతు’ పేరిట ఓ బ్రిడ్జిని ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిని జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. గుజరాత్ లోని ద్వారక జిల్లాలోని బేట్ ద్వారకా ద్వీపాన్ని ఓఖా ప్రధాన భూభాగాన్ని కలుపుతూ దీనిని నిర్మించారు. ఈ వంతెన పొడవు 2.32 కిలోమీటర్లు. దాదాపు రూ.980 కోట్లతో నిర్మించిన ఈ వంతెన కు ఇరువైపులా శ్రీకృష్ణుడి చిత్రాలు ఉంటాయి. ఫుట్ పాత్ పై సోలార్ ఎనర్జీ ప్యానెళ్లను అమర్చారు. ఈ వంతెన నిర్మాణానికి 2016లో కేంద్ర రవాణా శాఖ మంత్రి ఆమోదం తెలిపారు. 2017 అక్టోబర్ 7న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.962 కోట్లు కాగా. ఆ తరువాత రూ.980 కోట్లకు పెంచారు. ఈ వంతెన కారణంగా లక్ష్యద్వీప్ లోని 8,500 మందికి ప్రయోజనం చేకూరనుంది.
Longest Cable Bridge In India: దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన.. దీని విశేషాలేంటో తెలుసా?
- Advertisment -