న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా దేశం మొత్తంలో 102 లోక్ సభ స్థానాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం లోని శాసనసభ స్థానాల్లోను ఎన్నికలు సాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రముఖ నటుడు రజినీకాంత్ చెన్నైలోని స్టెల్లా మెరిస్ కాలేజ్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఏం కే స్టాలిన్, చెన్నైలోని ఓ పోలింగ్ బూత్ వద్ద ఓటేశారు. రాధిక, శరత్ కుమార్ కుటుంబం కూడా ఓటు వేసింది. జగద్గురు జగ్గీ వాసుదేవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి దశ ఎన్నికల్లో బిజెపి నుంచి నితిన్ గడ్కరి, కిరణ్ రిజుజు, అన్నమాలై, తమిళ సై సౌందర రాజన్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కార్తీ చిదంబరం, కనిమొళి పోటీలో ఉన్నారు
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న మొదటి విడత పోలింగ్
- Advertisment -