Ind Vs England: రాంచీ వేదికగా సాగుతున్న భారత్, ఇంగ్లాండ్ నాలుగో టెస్టులో భారత్ బౌలర్లు విజృంభించారు. దీంతో ఇంగ్లండ్ కు కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. తొలి సెషన్ లో ఇంగ్లండ్ ఐదు వికెట్లను కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లడ్ తరుపున డకెట్, క్రాలీ బరిలోకి దిగారు. తొలి వికెట్ కోల్పోయేసరికి జోడీగా 47 పరుగులు చేశారు. ఆ తరువాత 7వ ఓవర్ లో భారత బౌలర్ సిరాజ్ వేసిన బంతికి క్రాలీ విశ్వరూపాన్ని చూపించాడు. నాలుగు బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. మొత్తంగా ఒకే ఓవర్లో19 పరుగులు చేశాడు.
ఈ దశలో ఆకాశ్ దీప్ రంగంలోకి దిగడంతో పరిస్థితి మారిపోయింది. మెరుపువేగంతో బంతులు వేసి మూడు వికెట్లు తీసుకున్నాడు. 9వ ఓవర్లో రెండో బాల్ కు డకౌట్ (11) వికెట్ తీసుకున్నాడు. ఆ తరువాత పోప్ కు వేసి ఎల్ బీ డబ్ల్యూ తో వెనక్కిపంపాడు. ఆ తరువాత 11 ఓవర్లో 5వ బంతికి క్రాలీ(42) వికెట్ తీశాడు. దీంతో ఇంగ్లండ్ కు కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది.