భువనేశ్వర్: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అంటే ఏదో ఒక రకంగా కేసులు నమోదై ఉంటాయి. కానీ ఓ అభ్యర్థిపై ఒక్క కేసు కూడా మోదు కాలేదు. ఇప్పటివరకు ఐదుసార్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసి ఆరోసారి కోసం తన నామినేషన్ వేసిన సందర్భంగా ఆయన వివరాలు బయటకు వచ్చాయి. ఆయన ఎవరో కాదు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. నవీన్ పట్నాయక్ తాజాగా అసెంబ్లీ నియోజకవర్గానికి మరోసారి నామినేషన్ దాఖలు చేశారు. తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు మొత్తం ఆస్తులు 71.07 కోట్లుగా ఉన్నట్లు ప్రకటించారు. తన చేతిలో 30,000 నగదు 1980 మోడల్ అంబాసిడర్ కారు ఉన్నట్టు తెలిపారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదని నవీన్ పట్నాయక్ తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో సీఎం ఆస్తులు రూ.7 కోట్లు పెరిగిందని పేర్కొన్నారు.
