Saturday, October 31, 2026

Telangana Bjp : బీజేపీ సెకండ్ లిస్టు.. మరింత ఆలస్యం..

Telangana Bjp : హైదరాబాద్, జనతా న్యూస్:  తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ముందుగానే ప్రకటించింది. కొందరు ఇప్పటికే ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. అయితే ప్రతి పక్ష పార్టీలైనా కాంగ్రెస్, బీజేపీలు మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. టికెట్ల కేటాయింపులో ఆలస్యం చేస్తున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ 53 మందితో తొలిజాబితాను విడుదల చేసింది. బీజేపీ సైతం 52 మంది పేర్లను బయటపెట్టింది. కానీ మిగతా స్థానాలపై మరింత ఆలస్యం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పార్టీ ప్రతినిధుల నుంచి వస్తున్న సమచారం ప్రకారం నవంబర్ 2న మిగతా అభ్యర్థుల పేర్లు రిలీజ్ చేస్తారని అంటున్నారు. నవంబర్ 1న పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో అభ్యర్థులను ఫైనల్ చేసి ఆ తరువాత నవంబర్ 2న జాబితాను ప్రకటిస్తారని తెలుస్తోంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇప్టపి వరకు 52 వాటికి అభ్యర్థులను ప్రకటించారు. మిగతా స్థానాల్లో టికెట్ ఎవరికి వస్తుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రకటించిన కొన్ని స్థానాల్లో అసంతృప్తి నెలకొంది.

సిరిసిల్ల నియోజకవర్గంలోని రమాకాంత్ రావు తనకు టికెట్ రాలేదని బీఆర్ఎస్ లో చేరారు. ఈ నేపథ్యలో టికెట్ రాని వారు పార్టీ మారే అవకాశం ఉండడంతో ఆచి తూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా టికెట్ ఆశిస్తూ ప్రకటించని నియోజకవర్గాల్లో మాత్రం నాయకులు నిరాశతో ఉన్నారు. నవంబర్ 3నే నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే రెండో జాబితా రిలీజ్ చేయడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page