Tuesday, October 27, 2026

Telangana Bjp : రేపు బీజేపీలోకి ఆరెపల్లి మోహన్

Telangana Bjp :మానకొండూర్, జనతా న్యూస్:  తెలంగాణలో ఎన్నికల వాతావరణం ఏర్పడుతుండడంతో నాయకులు పార్టీలు మారుతున్నారు. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ గా పసనిచేసిన ఆరెపల్లి మోహన్ అక్టోబర్ 13న భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి .కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, జాయినింగ్స్ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు తన అనుచరులతో కలిసి బుధవారం కరీంనగర్ ఎంపీ కార్యాలయానికి వచ్చిన ఆరెపల్లి మోహన్ బండి సంజయ్ ను కలిశారు. ఆయనతో చాలా సేపు భేటీ అయిన తరువాత ఆరెపల్లి మోహన్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనతోపాటు బీఆర్ఎస్ కు చెందిన ప్రజాప్రతినిధులు సైతం బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఆరెపల్లి బీజేపీలో చేరుతున్న సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ పార్టీలో అందరితో కలుపుగోలుగా ఉండాలని సూచించారు. మానకొండురు నియోజకవర్గం సహా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ గెలుపే లక్ష్యంగా టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. కాగా ఆరెపల్లి మోహన్ తో పాటు బీజేపీలో చేరే వారిలో జడ్పీటీసీలు, ఎంపీపీలు,ఎంపీటీసీలతో సుమారు వంద మంది ఉన్నట్లు సమాచారం.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page