Telangana Bjp :మానకొండూర్, జనతా న్యూస్: తెలంగాణలో ఎన్నికల వాతావరణం ఏర్పడుతుండడంతో నాయకులు పార్టీలు మారుతున్నారు. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ గా పసనిచేసిన ఆరెపల్లి మోహన్ అక్టోబర్ 13న భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి .కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, జాయినింగ్స్ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు తన అనుచరులతో కలిసి బుధవారం కరీంనగర్ ఎంపీ కార్యాలయానికి వచ్చిన ఆరెపల్లి మోహన్ బండి సంజయ్ ను కలిశారు. ఆయనతో చాలా సేపు భేటీ అయిన తరువాత ఆరెపల్లి మోహన్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనతోపాటు బీఆర్ఎస్ కు చెందిన ప్రజాప్రతినిధులు సైతం బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఆరెపల్లి బీజేపీలో చేరుతున్న సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ పార్టీలో అందరితో కలుపుగోలుగా ఉండాలని సూచించారు. మానకొండురు నియోజకవర్గం సహా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ గెలుపే లక్ష్యంగా టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. కాగా ఆరెపల్లి మోహన్ తో పాటు బీజేపీలో చేరే వారిలో జడ్పీటీసీలు, ఎంపీపీలు,ఎంపీటీసీలతో సుమారు వంద మంది ఉన్నట్లు సమాచారం.
Telangana Bjp : రేపు బీజేపీలోకి ఆరెపల్లి మోహన్
- Advertisment -