Telangana Assembly :తెలంగాణ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో ముందుగా గవర్నర్ తమిళసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నీటిపారుదల శాఖకు సంబంధించి శ్వేత పత్రం విడుదల చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పై విజిలెన్స్ విచారణ నివేదికను సభలో వివరించనున్నారు. మరోవైపు నీటి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే అంశం సైతం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. సభలోనే అన్ని అంశాలు చర్చించడానికి సిద్ధమని ఆర్థిక శాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ను లేకుండా చేస్తామన్న సీఎం రేవంత్, కాంగ్రెస్ నేతల ప్రకటనలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కెఆర్ఎంబీ పరిధిలోకి కృష్ణ ప్రాజెక్టులు వెళితే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. డ్యాములకు సున్నం వేయాలన్న బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగిస్తే జరిగేది నష్టం అని హెచ్చరించారు.
అయితే కృష్ణానది జలాల పెంపకాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని శాసనసభ వేదికగా వెలిగెత్తి చాట డానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికను రూపొందించినట్లు సమాచారం. కృష్ణా నది జలాలకు సంబంధించి బీఆర్ఎస్ ఈనెల 13న నల్గొండ జిల్లా కేంద్రంలో జరపతల పెట్టిన బహిరంగ సభకు దీటుగా శాసనసభలో కృష్ణానది జనాల పంపకాలు నాగార్జునసాగర్ శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణ నది యాజమాన్య బోడుకు అప్పగించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు వివరించడానికి సిద్ధమైంది 13వ తేదీన అసెంబ్లీ ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహించి కృష్ణా నది జలాలపై టిఆర్ఎస్ నిర్వాహకాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించింది.