Tuesday, October 27, 2026

Telangana Assembly: కోమటిరెడ్డి వెంకటరెడ్డి Vs హరీష్ రావు

Telangana Assembly:  హైదరాబాద్, జనత న్యూస్:  తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, మంత్రి కోమటిరెడ్డి మధ్య మాటల యుద్ధం సాగింది. కృష్ణ జలాలపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై మాట్లాడేందుకు హరీష్ రావుకు అవకాశం వచ్చింది. ఇది సత్యదూరమైన ప్రజంటేషన్ అంటూ హరీష్ రావు ఆరోపించారు. వాస్తవాలను వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని, కానీ స్పీకర్ అవకాశం ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ నల్గొండలో సభ పెడుతుంటే ప్రభుత్వం తప్పులను సరిచేసుకుంటుందని అన్నారు. అయితే హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. నల్గొండ జిల్లాను మోసం చేసినందునే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించారన్నారు. ఏపీ అసంబ్లీలో జగన్ ఇచ్చిన స్టేట్ మెంట్ వినిపించలేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్, హరీష్ రావు, జగదీశ్ రెడ్డిలు కలిసి తమ జిల్లాను మోసం చేశారని అన్నారు. ఈ విషయంలో కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పిన తరువాత నల్గొండ సభకు రావాలని అన్నారు. అయితే రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను అలా అనడం సరికాదంటూ కోమటిరెడ్డిపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page