Friday, July 4, 2025

Tea With Salt: టీ లో చక్కెరకు బదులు ఉప్పు కలుపుకొని తాగితే అనేక పోషకాలు.. ఎలాగంటే

Tea With Salt:  చాలామంది ఉదయం లేవగానే కచ్చితంగా టీ లేదా కాపీ వంటివి తాగుతూ ఉంటారు.  ప్రపంచంలో అత్యధికంగా తాగే పానీయం  టీ మాత్రమే. మామూలుగా టీ లో కాస్త  చక్కెర కలుపుకొని తాగుతూ ఉంటారు. కానీ తాజాగా కొందరు ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. టీ లో కొద్దిగా ఉప్పు కలుపుకొని తాగడం వల్ల  అనేక ప్రయోజనాలు ఉంటాయంటున్నారు.  ఇలా తాగడం వల్ల శరీరంలోని  రోగ నిరోధక శక్తి  పెరుగుతుంది.  శరీరానికి అవసరమైన పోషకాలను అందించడమే  కాకుండా గొంతు ఇన్ఫెక్షన్ నుంచి  బయటపడేలా చేస్తుంది. ఉప్పులో ఉండేటువంటి కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటివి శరీరానికి చాలా ముఖ్యం. అందుకే కొన్ని సందర్భాల్లో ఉప్పు కలిగిన పదార్థాలు తింటూ ఉంటారు.   వేసవికాలంలో శరీరం డీ హైడ్రేషన్  కాకుండా ఉండడానికి ఉప్పు చాలా ఉపయోగపడుతుంది. అయితే  టీ లో కాస్త ఉప్పు వేసుకొని తాగడం వల్ల శరీరానికి జింకు వంటి పోషకాలు అందుతాయి. శరీరాన్ని సైతం చల్లగా ఉంచడంలో ఈ పానీయం ఉపయోగపడుతుందని అంటున్ఎనారు. ఎక్కువ తలనొప్పితో బాధపడే వారు టీ లో కాస్త ఉప్పు వేసుకోని తాగడం వల్ల ఉపశమాన్ని పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page