Saturday, October 31, 2026

అనుమానాస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థి ని మృతి..!

హన్మకొండ, జనతా న్యూస్: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బైపిసి చదువుతున్న వలుగుల సాహిత్య అనే విద్యార్థిని గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విద్యార్థిని కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామానికి చెందిన వలుగుల సాహిత్య హనుమకొండలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతూ కళాశాలకు చెందిన హాస్టల్ లోనే ఉంటుంది. గురువారం అర్దరాత్రి కాలేజీ బిల్డింగ్ కాలేజీ పైనుంచి దూకి ఆత్మ హత్యకు పాల్పడిందని యాజమాన్యం చెబుతోంది. అయితే  విద్యార్థిని తల్లిదండ్రులు రాకముందే ఆమె మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించడం పలు అనుమానాలకు తావిస్తోంది. గురువారం రాత్రి ఘటన జరిగినా.. శుక్రవారం ఉదయం వరకు తమకు సమాచారం అందించలేదని, నేరుగా పోస్ట్ మార్టo తరలించాక ఫోన్లో చెరప్పారని తల్లిదండ్రులు అన్నారు.

ఈ నేపథ్యంలో తమ కూతురిని కాలేజీ యాజమాన్యం హత్య చేశారని ఆరోపిస్తూ  కుటుంబ సభ్యులు, బంధువులు   కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు.  సమాచారం అందుకున్న హనుమకొండ ఏసిపి దేవేందర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని సాహిత్య తల్లిదండ్రులు బంధువులు విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని కళాశాల ముందు ఆందోళన చేపట్టడంతో ఎసిపి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనకారుతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థిని మృతిపై యాజమాన్యం గోప్యత పాటించడంపై అనుమానాలున్నాయని స్థానికులు తెలిపారు.

బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటే ముంచేతిపై కాట్లు పెట్టుకున్నట్టు కనబడుతుందని, ఆత్మహత్య బిల్డింగ్ పై దూకితే శరీరంపై బలమైన గాయాలు ఉండాలని ఒక గాయం కూడా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.సాహిత్య మృతికి కళాశాల యాజమాన్యం కారణమని తన బిడ్డను యాజమాన్యమే హత్య చేసిందని భావిస్తూ శుక్రవారం శివాని కాలేజీ ముందు ధర్నా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కళాశాల ముందు భద్రత ఏర్పాటు చేశారు. ఈ విషయమే కేయు పోలీస్ స్టేషన్ సిఐ సంజీవ మాట్లాడుతూ విద్యార్థిని అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page