హన్మకొండ, జనతా న్యూస్: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బైపిసి చదువుతున్న వలుగుల సాహిత్య అనే విద్యార్థిని గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విద్యార్థిని కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామానికి చెందిన వలుగుల సాహిత్య హనుమకొండలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతూ కళాశాలకు చెందిన హాస్టల్ లోనే ఉంటుంది. గురువారం అర్దరాత్రి కాలేజీ బిల్డింగ్ కాలేజీ పైనుంచి దూకి ఆత్మ హత్యకు పాల్పడిందని యాజమాన్యం చెబుతోంది. అయితే విద్యార్థిని తల్లిదండ్రులు రాకముందే ఆమె మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించడం పలు అనుమానాలకు తావిస్తోంది. గురువారం రాత్రి ఘటన జరిగినా.. శుక్రవారం ఉదయం వరకు తమకు సమాచారం అందించలేదని, నేరుగా పోస్ట్ మార్టo తరలించాక ఫోన్లో చెరప్పారని తల్లిదండ్రులు అన్నారు.
ఈ నేపథ్యంలో తమ కూతురిని కాలేజీ యాజమాన్యం హత్య చేశారని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న హనుమకొండ ఏసిపి దేవేందర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని సాహిత్య తల్లిదండ్రులు బంధువులు విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని కళాశాల ముందు ఆందోళన చేపట్టడంతో ఎసిపి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనకారుతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థిని మృతిపై యాజమాన్యం గోప్యత పాటించడంపై అనుమానాలున్నాయని స్థానికులు తెలిపారు.
బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటే ముంచేతిపై కాట్లు పెట్టుకున్నట్టు కనబడుతుందని, ఆత్మహత్య బిల్డింగ్ పై దూకితే శరీరంపై బలమైన గాయాలు ఉండాలని ఒక గాయం కూడా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.సాహిత్య మృతికి కళాశాల యాజమాన్యం కారణమని తన బిడ్డను యాజమాన్యమే హత్య చేసిందని భావిస్తూ శుక్రవారం శివాని కాలేజీ ముందు ధర్నా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కళాశాల ముందు భద్రత ఏర్పాటు చేశారు. ఈ విషయమే కేయు పోలీస్ స్టేషన్ సిఐ సంజీవ మాట్లాడుతూ విద్యార్థిని అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.