Supreme Court : స్వలింగ సంపర్కుల వివాహంపై మంగళవారం సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. వీరి వివాహానికి చట్టబద్ధత కల్పించే అంశంపై దాఖలైన పిటిషన్ ను మంగళవారం విచారణ చేపట్టింది. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యంగ ధర్మాసం 10 రోజుల పాటు విచారణ చేపట్టి మే 11న తీర్పును రిజర్వులో ఉంచింది. దీనిపై తాజాగా నాలుగు వేర్వేరు తీర్పులనిచ్చింది. స్వలింగ సంపర్కులు పిల్లలను దత్తత తీసుకోవడాన్ని నిరాకరించింది. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం స్వలింగ సంపర్కులకు ఎలాంటి చట్టబద్ధత లేదు. అది తమ ప్రాథమిక హక్కు అని వారు పేర్కొనకూడదు . అందువల్ల ముందుగా పార్లమెంట్ నిర్ణయించాలని సుప్రీం తెలిపింది. అయితే సహజీవంలో వారు ఉండొచ్చని, వారిపై ఎలాంటి వివక్షకు పాల్పొడద్దని ఆదేశించింది.
Supreme Court : స్వలింగ సంపర్కుల విహాహంపై సుప్రీం కీలక తీర్పు..
- Advertisment -