ఐపీఎల్ 17వ సీజన్లో సన్ రైజర్స్ రికార్డు బద్దలు కొడుతోంది. తాజాగా ఈ జట్టు ప్లే ఆఫ్ లోకి అడుగు పెట్టింది. సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్ తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో కమిన్న్స్ సేన మూడో స్థానంతో ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంది. వాన ఎంతకు తగ్గకపోవడంతో అంపైర్లు చెరో జట్టుకు ఒక్కో పాయింట్ కేటాయించారు. దీంతో 15 పాయింట్లతో కమిన్ సేన టైటిల్ పోరులో నిలిచింది. అయితే సొంతగడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ విద్వాంసాన్ని చూద్దామనుకున్న ఫ్యాన్స్ కు నిరాశె మిగిలింది. కమిన్ సేన నేతృత్వంలో హైదరాబాద్ జట్టు ఈ సీజన్లో అదరగొట్టింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు అదృష్ట ఆరంబాలు ఇచ్చారు. మిడిల్ ఆర్డర్లో హెన్రిచ్ క్లాసెన్, మర్క్ రమ్, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిలు దంచి కొట్టారు.
ప్లే ఆఫ్ లోకి సన్ రైజర్స్..
- Advertisment -