Srishilam:పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ప్లాస్టిక్ నిషేధాన్ని విధించారు. దుకాణదారులు ఎలాంటి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్విలను విక్రయించకూడదని ఆలయ ఈవో డి పెద్దిరాజు ఆదేశాలు జారీ చేశారు. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా కాగితం. జూట్ సంచులను వినియోగించాలని సూచించారు. ప్లాస్టిక్ నిషేధంపై దేవస్థానానికి సహకరించాల్సిందిగా స్థానికులు, స్థానిక వ్యాపారులు, హోటల్ నిర్వాహకులను కోరారు. అయితే వాటర్ బాటిల్స్ నిషేధం తోప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సింగిల్ యూజూ ప్లాస్టిక్ పై నిషేధం విధించగా.. ఇప్పుడు మరింత కఠినంగా అమలు చేశారు.
Srishilam: శ్రీశైలంలో ఇక వాటర్ బాటిళ్లు నిషేధం..
- Advertisment -