Tuesday, November 3, 2026

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి: ప్రభుత్వ విప్

-ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచన

వేములవాడ,జనత న్యూస్: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని ప్రభుత్వ విప్ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు.బుధవారం రుద్రంగి మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరిశీలించి రైతులతో కలిసి కూర్చొని సమస్యలు అడిగి తెలుసుకున్నారు.వేములవాడ నియోజకవర్గ పరిధిలోని చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట,మేడిపల్లి భీమారం,వేములవాడ రూరల్,వేములవాడ అర్బన్ మండల పరిధిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులకు కోరారు.అనంతరం పౌరసరఫరాల కమిషనర్ చౌహన్, జగిత్యాల జిల్లా కలెక్టర్ యస్మిన్ పాషా,రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగం జయంతి,డీసీఏస్ఓ జితేందర్ రెడ్డి, డీఎం జితేందర్ ప్రసాద్,సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తూ,రానున్న వర్షాలను దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోళ్ళను వేగవంతం చేయాలని కోరారు.లారీల కొరత లేకుండా చూడాలని కోరుతూ లారీ ఓనర్ అసోసియేషన్, వేములవాడ పట్టణ పరిధిలోని వ్యాన్ అసోసియేషన్ సభ్యులకు తెలిపారు.అనంతరం జిల్లా పార బాయిల్డ్ రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజు తో మాట్లాడి ధాన్యం బస్తాలను త్వరగా దిగుమతి చేసుకోవాలని సూచించారు.రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తనను సంప్రదించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ తెలిపారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page