రామ్ పోతినేని కథానాయకుడిగా 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టిన విషయం తెలిసిందే. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆధ్వర్యంలో వచ్చిన ఈ మూవీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ మూవీకి సీక్వెల్ గా ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’ వస్తుంది. ఈ మూవీకిి సంబంధించి మే 15వ తేదీన మూవీకి పూరి జగన్నాథ్ వీడియోను విడుదల చేశారు. డబుల్ ఇస్మార్ట్ రీక్యాప్ అంటూ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలోని సన్నివేశాలతో పాటు అప్పుడు థియేటర్ల అభిమానులు సందడి చేసిన సన్నివేశాలను ఇందులో పొందుపరిచారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫుల్ టీజర్ వచ్చేసింది. ఫుల్ మాస్ గెటప్ లో రామ్ డైలాగ్ తో అదరగొట్టారు. ప్రతి నాయకుడు పాత్రలో సంజయ్ దత్ కనిపించారు. టీజర్ ను చూస్తే చూస్తే ఈసారి వినోదం, యాక్షన్ అన్ని డబుల్ గా కనిపించే అవకాశం ఉందని కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.
‘ఇస్మార్ట్ డబుల్’ ధమాకా..
- Advertisment -