Singareni: సింగరేణి ఎన్నికలు వాయిదా పడ్డాయి. అక్టోబర్ 28న జరగాల్సిన సింగరేణి ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల కారణంగా డిసెంబర్ కు తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తరువాత డిసెంబర్ 25న సింగరేణి ఎన్నికల నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 30 లోపు ఓటర్ లిస్ట్ తయారు చేయాలని పేర్కొంది. సింగరేణి ఎన్నికలు ఆరు జిల్లాలో జరగనుండగా ఇందులో మూడు జిల్లాల్లో నక్సల్స్ ప్రభావం ఉంది. అసెంబ్లీ ఎన్నికల కారణంగా సింగరేణి ఎన్నికల నిర్వహణ కష్టంగా ఉంటుందని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సింగరేణి ఎన్నికలను వాయిదా వాయిదాలను వేయాలని కోరారు. సింగరేణి సంబంధించిన ఆరు జిల్లాల్లో మొత్తం 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల తర్వాత సింగరేణి ఎన్నికల నిర్వహించాలని కోరుతున్నట్లు రామచంద్రరావు తెలిపారు. అయితే అక్టోబర్ నుంచి సింగరేణి యాజమాన్యం వాయిదా అడుగుతూనే ఉంది. కాగా 43000 మంది ఓటర్ల జాబితా ఇప్పటికే రెడీ అయింది. చాలా వాయిదాలు అడిగారని కేంద్ర ప్రభుత్వం తరఫున వాదన వినిపించారు. కానీ వాదనలు విన్న హైకోర్టు సింగరేణి ఎన్నికలను వాయిదా వేసింది.
Singareni: సింగరేణి ఎన్నికలు వాయిదా
- Advertisment -