Monday, October 26, 2026

సిద్ధిపేట: పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు: -సీపీ అనురాధ 

సిద్ధిపేట, జనత న్యూస్: పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు నిర్వహించనున్నట్లు సిద్ధిపేట పోలీస్ కమిషనర్ అనురాధ పేర్కొన్నారు.  ఈనెల 13న జరిగే  లోక్ సభ ఎన్నికల సందర్భంగా కేంద్ర బలగాలు (ఎస్ఎస్బి) సశాస్త్ర సీమ బల్, (సీఏపీఎఫ్)  సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ కమాండెంట్ అసిస్టెంట్ కమాండెంట్  ఇన్స్పెక్టర్లకు  కమిషనర్ కార్యాలయంలో పటిష్టమైన బందోబస్తు  ఫ్లాగ్ మార్చ్, వెహికల్ చెకింగ్ తదితర అంశాలపై సీపీ అనురాధ దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో ఉన్న భౌగోళిక పరిస్థితుల గురించి లోక్ సభ ఎన్నికల సందర్భంగా క్రిటికల్, నార్మల్ పోలింగ్ కేంద్రాలు, రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, స్టాటికల్ బందోబస్తు తదితర అంశాల గురించి తెలియజేశారు.

విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనాలు తనిఖీ చేసేటప్పుడు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.అధికారులకు సిబ్బందికి మంచి అకామిడేషన్ ఏర్పాటు చేయాలని ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, అడిషనల్ డీసీపీ ఎస్ మల్లారెడ్డి, సిద్దిపేట ఏసీపీ మధుకు సూచించారు.ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి, ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసిపి మధు, ఎస్ఎస్బి కమాండెంట్  ఆశీమ్ ఉపాధ్యాయ, అసిస్టెంట్ కమాండెన్స్ రాజేష్ కుమార్, నీరజ్ కుమార్, అతుల్ కుమార్, సీఏపీఎఫ్  అసిస్టెంట్ కమాండెంట్  ఆర్కే యాదవ్, ఇన్స్పెక్టర్ వెంకటరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్, ఎలక్షన్స్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ధరణి కుమార్, విష్ణు ప్రసాద్,  త్రీటౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, ఐటీ సెల్ ఎస్ఐ నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page