సిద్ధిపేట, జనత న్యూస్: పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు నిర్వహించనున్నట్లు సిద్ధిపేట పోలీస్ కమిషనర్ అనురాధ పేర్కొన్నారు. ఈనెల 13న జరిగే లోక్ సభ ఎన్నికల సందర్భంగా కేంద్ర బలగాలు (ఎస్ఎస్బి) సశాస్త్ర సీమ బల్, (సీఏపీఎఫ్) సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ కమాండెంట్ అసిస్టెంట్ కమాండెంట్ ఇన్స్పెక్టర్లకు కమిషనర్ కార్యాలయంలో పటిష్టమైన బందోబస్తు ఫ్లాగ్ మార్చ్, వెహికల్ చెకింగ్ తదితర అంశాలపై సీపీ అనురాధ దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో ఉన్న భౌగోళిక పరిస్థితుల గురించి లోక్ సభ ఎన్నికల సందర్భంగా క్రిటికల్, నార్మల్ పోలింగ్ కేంద్రాలు, రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, స్టాటికల్ బందోబస్తు తదితర అంశాల గురించి తెలియజేశారు.
విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనాలు తనిఖీ చేసేటప్పుడు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.అధికారులకు సిబ్బందికి మంచి అకామిడేషన్ ఏర్పాటు చేయాలని ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, అడిషనల్ డీసీపీ ఎస్ మల్లారెడ్డి, సిద్దిపేట ఏసీపీ మధుకు సూచించారు.ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి, ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసిపి మధు, ఎస్ఎస్బి కమాండెంట్ ఆశీమ్ ఉపాధ్యాయ, అసిస్టెంట్ కమాండెన్స్ రాజేష్ కుమార్, నీరజ్ కుమార్, అతుల్ కుమార్, సీఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఆర్కే యాదవ్, ఇన్స్పెక్టర్ వెంకటరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్, ఎలక్షన్స్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ధరణి కుమార్, విష్ణు ప్రసాద్, త్రీటౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, ఐటీ సెల్ ఎస్ఐ నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.