హైదరాబాద్, జనతా న్యూస్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్ ను పోలీసులు పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు రోడ్డు ప్రమాదం కేసులో రహేల్ నిందితుడిగా ఉన్నారు. ఈయన కోసం కొంతకాలంగా పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా దుబాయ్ నుంచి హైదరాబాద్ కు తిరిగిన వచ్చిన సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
2023 సంవత్సరంలో డిసెంబర్ 23న తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్ లోని ప్రగతి భవన్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ఇక్కడ ఉన్న భారీకేట్ల పైకి దూసుకెళ్లింది. అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకొని వాహనంలో ఉన్న వారిని అదుపులోకి తీసుకొ నిందితులను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు, ఇందులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే పోలీస్ స్టేషన్ నుంచి అతను తప్పించుకున్నాడా? లేదా నిందితుడిని కావాలనే తప్పించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొత్తంగా ఆయనను పోలీసులు అరెస్టు చేశారు