Thursday, September 19, 2024

Revanth Reddy: గన్ పార్క్ వద్ద రేవంత్ రెడ్డి అరెస్ట్..ఉద్రిక్తత

Revanth Reddy: హైదరాబాద్, జనతా న్యూస్:  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిన పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని అమరవీరుల స్థూపం వద్దకు వెళ్తుండగా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం సీఎల్పీ సమావేశానికి వచ్చిన రేవంత్ రెడ్డి అనంతరం ఒంటిగంటకు అమరవీరుల స్థూపం వద్దకు బయలుదేరారు. అయితే అంతకుముందే గన్ పార్క్ వద్ద పోలీసలు ఆయనను అడ్డుకున్నారు. సోమవారం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఈఎన్నికల్లో డబ్బు, మద్యం లేకుండా ఎన్నికల్లోకి వెళ్లడానికి సిద్ధమా? అని కేసీఆర్ కు సవాల్ చేశారు. దీనిపై ప్రమాణం చేయడానికి అమరవీరుల స్థూపం వద్దకు రావాలన్నారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందన ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు తెలిపారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page