Thursday, October 29, 2026

రాహుల్ గాంధీకి సొంత వాహనం లేదు..!

Rahul Gandhi Assets: కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీకి రూ.20 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. సొంత వాహనం కానీ, రెసిడెన్షియల్ ప్లాట్ గాని లేదని తన అఫిడవిట్ లో  పేర్కొన్నారు. వచ్చే లోక్ సభ  ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళలోని వయనాడు నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన ఆవిడ విట్ లో తన ఆస్తుల వివరాలు పేర్కొన్నారు. రాహుల్ వద్ద రూ. 55 వేల నగదు. రూ. 26.25 లక్షల బ్యాంకు డిపాజిట్లు, రూ. 4.33 కోట్ల బాండ్లు.. షేర్లు, రూ. 3.81 కోట్ల మ్యూచువల్ ఫండ్స్, రూ.15.21 లక్షల గోల్డ్ బాండ్లు, రూ. 4.20 లక్షల విలువైన నగలు సహా రూ. 9.24 కోట్ల చరాస్తులు ఉన్నాయి. రాహుల్ రూ.  11.15 కోట్ల స్థిరాసులు కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు.

ఢిల్లీలోని మెహరౌలి ప్రాంతంలో సోదరి ప్రియాంక గాంధీతో కలిసి వ్యవసాయ భూమి ఉంది. గురుగ్రామ్ లో రూ. 9 కోట్లకు పైగా విలువైన ఆఫీస్ స్పేస్ ఉంది. వ్యవసాయ భూమి తనకు వారసత్వంగా వచ్చిందని రాహుల్ అఫిడవిట్ లో పేర్కొన్నారు.

రాహుల్ పై నమోదైన కేసుల గురించి కూడా వెల్లడించారు. అత్యాచార బాధిత కుటుంబం వివరాలను సోషల్ మీడియాలో బయట పెట్టినందుకు రాహుల్ పై ఫోక్స్ చట్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో పాటు బీజేపీ నేతల ఫిర్యాదు పై పరువు నష్టం కేసులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ సంబంధించిన నేరపూరిత కుట్ర కేసు కూడా తనపై నమోదు అయినట్లు రాహుల్ గాంధీ అఫిడవిట్ లో పేర్కొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page