జనత న్యూస్, జగిత్యాల : కాంగ్రెస్ జాతీయ నాయకులు జగిత్యాల జిల్లాలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు ఈనెల 18న పర్యటించనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి తెలిపారు. 18 న జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ప్రసిద్ధి గాంచిన కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకొని అనంతరం రాహుల్ , ప్రియాంక గాంధీలు జగిత్యాలకు వస్తారని శుక్రవారం జీవన్ రెడ్డి పర్యటన వివరాలను వెల్లడించారు. అంజన్న ను దర్శించుకున్న అనంతరం జగిత్యాల కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద రాహుల్ గాంధీ ,ప్రియాంక గాంధీలు రో డ్ షోలో పాల్గొంటారని పేర్కొన్నారు. కొత్తబస్టాండ్ వద్ద రోడ్ షోలో కాంగ్రెస్శీ అగ్రనేతలు పాల్గొన్ననున్న దృష్ట్యా అప్రాంతాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ సుశాంక్ మిశ్రా కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు.
18న జగిత్యాలలో రాహుల్, ప్రియాంక గాంధీల పర్యటన
- Advertisment -