Pushpa 2: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా బన్నీ ఫ్యాన్స్ కు ఐకాన్ స్టార్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. లేటేస్టుగా పుష్ప 2 కు సంబంధించి బుధవారం లేటేస్ట్ ఫొటోను రిలీజ్ చేశాడు. సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న పుష్ప2 సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ లుక్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా లేటేస్ట్ ఫొటోను రిలీజ్ చేయడంతో ఫ్యాన్ష్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయన టీజర్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ టీజర్ యూట్యూబ్లో రికార్డు బ్రేక్ చేసింది. అల్లు అర్జున్ అమ్మవారు గెటప్ లో కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు. మరో వైపు పుష్ప 2 ను ఆగస్టు 15 విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా కోసం తెలుగుతో పాటు బాలీవుడ్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
