Sunday, October 25, 2026

‘పల్స్ పోలియో’ను విజయవంతం చేయాలి : కలెక్టర్

కరీంగనర్, జనతా న్యూస్:మార్చి 3, 4, 5 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి ఒక్క చిన్నారికి వైద్య సిబ్బంది పోలియో చుక్కలు వేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం పై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాతతో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పల్స్ పోలియో కార్యక్రమం 100% విజయవంతం అయ్యేలా దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమంలో ఏ ఒక్క చిన్నారిని వదలకుండా అందరికీ పోలియో చుక్కలు వేయించాలని అధికారులకు సూచించారు. పట్టణాలు, గ్రామాల్లో ఈ కార్యక్రమం పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అందరి సహకారంతోనే కార్యక్రమం విజయవంతమవుతుందని తెలిపారు. జిల్లాలో 89,273 మంది 0-5 సంవత్సరాలలోపు చిన్నారులు ఉన్నారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 545 పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామని, అర్బన్ ప్రాంతాల్లో 150 గ్రామీణ ప్రాంతాల్లో 395 కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లలో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కరీంనగర్ తో పాటు పట్టణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమము అధిక శాతం విజయవంతం అయ్యేలా చూడాలని, దీనిపై అవగాహన కల్పించాలని సూచించారు. వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పల్స్ పోలియో కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత, డిప్యూటీ వైద్యాధికారి జువేరియా, డి ఐ ఓ సాజిత హత హరి, డబ్ల్యుహెచ్ వో కన్సల్టెంట్ అధల్ నిగామె, డీ ఈవో జనార్దన్ రావు, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, సఖి అడ్మినిస్ట్రేటర్ లక్ష్మి, డీఎం అండ్ హెచ్ ఓ డెమో రంగారెడ్డి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page